Site icon vidhaatha

కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

విధాత, హైదరాబాద్‌ : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. ఓఎస్సార్ ప్రాజెక్టు నిర్మాణాలు చేస్తుండగా కన్నారావు రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో 2ఎకరాల భూమిని కబ్జాకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది. కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు.  కన్నారావు తమ అనుచరులతో కలసి జేసీబీని తీసుకు వచ్చి భూమిని కబ్జా చేశారన్న ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version