BRS | బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు స‌స్పెండ్

BRS | పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న వారిపై బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) చ‌ర్య‌లు ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ), కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారావు( Jupally Krishna Rao )ను స‌స్పెండ్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారావు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) ఆదేశాల […]

  • Publish Date - April 10, 2023 / 04:57 AM IST

BRS | పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న వారిపై బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) చ‌ర్య‌లు ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ), కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారావు( Jupally Krishna Rao )ను స‌స్పెండ్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారావు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) ఆదేశాల మేర‌కు బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యం ఇద్ద‌ర్నీ స‌స్పెండ్ చేసింది.

ఖమ్మం గుమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్‌గా విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారావు హాజ‌రైన విష‌యం విదిత‌మే. ఇదే వేదికపై సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు ఇద్దరు నేతలు.

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని.. కానీ అది సాధ్యమ‌య్యే ప‌ని కాద‌ని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కుటుంబ స్వార్థానికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారని.. అది పగటి కలేనంటూ విమర్శించారు.

ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్‌ తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని జూపల్లి కృష్ణారావు ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని.. బీఆర్ఎస్ పేరుతో చెత్త పాలనను దేశానికి ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

Latest News