Power Star Pawan Kalyan apologizes ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాలతో పాటు.. ఇటు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడున్న బిజీలో.. ఏదైనా సినిమా వేడుకలకు హాజరు కావాలంటే చాలా కష్టం.
ఆయన చేస్తున్న రెండు పడవల ప్రయాణంలో పవన్ కళ్యాణ్‌కి క్షణం తీరిక ఉండదు. ఈ క్రమంలో ఆయన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు, సుదీప్‌లకు క్షమాపణ చెప్పాడు. అదేంటి పవన్ కళ్యాణ్ ఏంటి.. క్షమాపణలు (apologizes) చెప్పడం ఏమిటని అనుకుంటున్నారా?
క్షమించమని ప్రెస్ నోట్ విడుదల
విషయంలోకి వస్తే.. ఉపేంద్ర (UPENDRA), కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘కబ్జా’ (Kabja) ఇది భారీ చిత్రంగా రూపొందింది. ఈ మూవీని కన్నడ (kannada) తో పాటు పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో కూడా మూవీని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు ఆడియెన్స్‌లో ఈ సినిమా క్రేజ్ కోసం మేకర్స్ ఓ ప్లాన్ చేశారు.
అందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)ను ఆడియో ఫంక్షన్‌కు ప్రత్యేక అతిథిగా పిలిచారు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ కారణంగా.. తను ఫంక్షన్‌కు రాలేక పోతున్నందుకు బాధ పడుతున్నానంటూ క్షమించమని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఉపేంద్రకు శుభాకాంక్షలు
అందరికీ ధన్యవాదాలు. అయితే ముందుగా అనుకున్న కార్యక్రమాలు దృష్ట్యా నేను ఈ ఫంక్షన్‌కి రాలేక పోతున్నాను. అందుకు నేను బాధ పడుతున్నాను. పొలిటికల్ మీటింగ్స్‌తో బిజీగా ఉన్నందు వలన వేడుకకు రావట్లేదు. ఇక ఉపేంద్ర (upendra)కు శుభాకాంక్షలు అని తెలిపారు. ఈ సినిమాలో శ్రియ శరణ్ (Shriya Saran) ముఖ్యపాత్ర పోషిస్తుండగా, పోసాని కృష్ణ మురళీ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఆర్ చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు.