వరుస ఫ్లాపుల అనంతరం ప్రభాస్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సలార్ సినిమా వసూళ్లపరంగానూ రికార్డులు సృష్టిస్తున్నది. తొలి రోజు వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు 175 కోట్ల రూపాయలు దాటిపోయాయి. దేశీయంగానే 135 కోట్లు వసూలు చేసింది. ఇండస్ట్రీ ట్రాకింగ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ అంచనా ప్రకారం.. సినిమా డొమెస్టిక్ అడ్వాన్స్ సేల్స్ 49 కోట్లు. రిలీజ్ డేట్ రోజు అది 60 కోట్లుగా పేర్కొన్నది. పాన్‌ఇండియా మూవీ అయిన సలార్‌లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు.
డిసెంబర్ 22న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే.. విడుదల రోజు 180 కోట్ల వరకూ అది వసూలు చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో ఆన్‌లైన్ బుకింగ్స్‌లోనే 42 కోట్లు దాటిందని చెబుతున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేల్స్‌ను కలిపితే అది 180 కోట్లకు చేరువలో ఉంటుందని చెబుతున్నారు. 2023లోనే దేశంలో ఏ సినిమా కూడా తొలిరోజు ఇంత వసూలు చేయలేదు. ప్రభాస్ సలార్ ఆ ఘనత సాధించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.