Pregnant Woman | అంతరిక్షంలోకి రాకెట్లు.. ప్రసవానికి లేవు అంబులెన్స్! ప్రసవ నొప్పులతో డోలీపై 8 కి.మీ. ప్రయాణం.. మహిళ మృతి

Pregnant Woman | మన్యంలో ఇంకా డోలీ మోతలు ! రోడ్లు లేని పల్లెలు.. దారి తెన్ను లేని గ్రామాలు ఆస్పత్రికి వెళ్తుండగా గిరిజన మహిళ మృతి.. అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నాం.. కానీ ఓ ఆడ కూతురు ప్రసవానికి కనీసం అంబులెన్స్ పంపలేక పోతున్నాం.. పెద్ద విమానాలు నడుపుతున్నాం.. పెద్ద పెద్ద జబ్బులకు మందులు కనిపెడుతున్నాం కానీ గిరి శిఖర గ్రామాల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం. దేశం ముందుకు వెళ్తుందో..ఇంకా ఏటీ యుగంలో కూడా ప్రసవ […]

  • Publish Date - June 24, 2023 / 09:59 AM IST

Pregnant Woman |

  • మన్యంలో ఇంకా డోలీ మోతలు !
  • రోడ్లు లేని పల్లెలు.. దారి తెన్ను లేని గ్రామాలు
  • ఆస్పత్రికి వెళ్తుండగా గిరిజన మహిళ మృతి..

అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నాం.. కానీ ఓ ఆడ కూతురు ప్రసవానికి కనీసం అంబులెన్స్ పంపలేక పోతున్నాం.. పెద్ద విమానాలు నడుపుతున్నాం.. పెద్ద పెద్ద జబ్బులకు మందులు కనిపెడుతున్నాం కానీ గిరి శిఖర గ్రామాల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం. దేశం ముందుకు వెళ్తుందో..ఇంకా ఏటీ యుగంలో కూడా ప్రసవ మరణాలు జరుగుతున్నందున ఇంకా వెనక్కి నడుస్తుందో తెలియని పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొండపైన గ్రామంలో గర్భిణి మృతి చెందింది. కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కుంబుర్ల కొండపైన గ్రామానికి చెందిన పాంగి రోజా(20)కు మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆశా వర్కర్ శాంతి గ్రామస్తుల సహాయంతో ఆమెను స్ట్రెచర్‌పై కూర్చోబెట్టింది. వారు సుమారు 2 కిలోమీటర్ల మేర స్ట్రెచర్‌ను మోసుకెళ్లి కొండపైకి వెళ్లగా, ఆ మహిళ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను శోక సంద్రంలో మునిగిపోయారు.

గ్రామంలో 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. కొండపై నుంచి కచ్చా మార్గం గుండా సుమారు 8 కి.మీ దూరం కాలినడకన ఆర్ల గ్రామానికి చేరుకోవాలి, అక్కడి నుండి 20 కి.మీ దూరంలో ఉన్న డౌనూరు పిహెచ్‌సికి మెటల్ రోడ్డు మరియు రవాణా అందుబాటులో ఉంది. 2020-21లో గిరిజన కుటుంబాలు తమ వనరులను సమకూర్చుకుని 8 కిలోమీటర్ల మేర కచ్చా రోడ్డును నిర్మించారు. వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయి రోడ్డు మార్గంగా మారిందని గిరిజన సంఘం నాయకులు కె.గోవిందరావు తెలిపారు.

రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించు కోలేదన్నారు. రోడ్డు లేకపోవడంతో కొన్నిసార్లు గర్భిణులు మృత్యువాత పడుతుండడంతో వారి కుటుంబ సభ్యులకు తీరని వేదన కలుగుతోంది. విశాఖతో బాటు పార్వతీపురం జిల్లాలో ఇలాంటి సంఘటనలు తరచూ సంభవిస్తున్నాయి.

పార్వతీపురం, సీతంపేట, సాలూరు, ఎస్.కోట ఏజెన్సీల నుంచి గిరిజనులు ప్రసవాలు సమీప పట్టణాలకు వస్తుంటారు. అయితే కొందరు అలా ఆస్పత్రులకు రావడానికి ఇష్టపడరు.. నెలలు నిండేవరకు గిరి శిఖర గ్రామాల్లోనే ఉంటూ చివరి రోజుల్లో ప్రసవం సమయంలో అనివార్య పరిస్థితుల్లో ఇలా డోలిలో ఆస్పత్రులకు చేరుతుంటారు.

మార్గమధ్యంలో పరిస్థితి వికటించి తల్లి.. బిడ్డల్లో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతూ బంధువులకు బాధను మిగులుస్తుంటారు. సాలూరులో గర్భిణులకు ఓ హష్టల్ నిర్మించి ప్రసవానికి రెండు నెలలు ముందే చేరేలా ఏర్పాట్లు చేసినా కొన్నాళ్ళకు అది నిర్వహణ సరిగా లేక గిరిజన మహిళలు రావడం తగ్గించారు

Latest News