Nalgonda | గుత్తా.. కంచర్ల మధ్య ప్రోటోకాల్ చిచ్చు! కనిపించని గుత్తా ఫొటో
రామాలయ ఉత్సవాల ఆహ్వానంలో కనిపించని గుత్తా ఫొటో విధాత: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, స్థానిక నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య అంతర్గతంగా నెలకొన్న ఆధిపత్య పోరు శ్రీరామనవమి ఉత్సవ ప్రోటోకాల్ వివాదంతో మరోసారి బహిర్గతమైంది. నల్లగొండ రామాలయంలో గురువారం తలపెట్టిన శ్రీరామనవమి ఉత్సవాల అధికారిక ఆహ్వానంలో ఆలయ చైర్మన్, ఈవోలు ఆహ్వానితుల జాబితాలో ప్రోటోకాల్ పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఉత్సవాల ఆహ్వాన పత్రికలో గాని, ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో […]

- రామాలయ ఉత్సవాల ఆహ్వానంలో కనిపించని గుత్తా ఫొటో
విధాత: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, స్థానిక నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య అంతర్గతంగా నెలకొన్న ఆధిపత్య పోరు శ్రీరామనవమి ఉత్సవ ప్రోటోకాల్ వివాదంతో మరోసారి బహిర్గతమైంది. నల్లగొండ రామాలయంలో గురువారం తలపెట్టిన శ్రీరామనవమి ఉత్సవాల అధికారిక ఆహ్వానంలో ఆలయ చైర్మన్, ఈవోలు ఆహ్వానితుల జాబితాలో ప్రోటోకాల్ పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది.
ఉత్సవాల ఆహ్వాన పత్రికలో గాని, ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కానీ స్థానికంగా ఉండే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు, ఫోటో లేకుండానే ముద్రించడం వివాదాస్పదమైంది. ప్రోటోకాల్ మేరకు గవర్నర్ తర్వాత స్థానంలో ఉండే మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పేరును, ఫొటోను రామాలయ ఆహ్వాన పత్రికలో పొందుపరచకపోవడం చర్చనీ అంశమైంది.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పర్యవేక్షణలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. దీంతో కంచర్ల వర్గం దురుద్దేశంతోనే ఆహ్వాన పత్రికలో సుఖేందర్ రెడ్డి పేరును పెట్టలేదని గుత్తా వర్గీయులు భావిస్తున్నారు. ఉత్సవ ఆహ్వాన పత్రికలలో, ఫ్లెక్సీలలో ప్రోటోకాల్ అనుసరించక.. తన పేరు, ఫోటో పెట్టకపోవడం పట్ల గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఒకే స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన సుఖేందర్ రెడ్డికి, భూపాల్ రెడ్డికి మధ్య గతం నుంచి నెలకొన్న వైరం తరుచు బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనూ, అధికారిక కార్యక్రమాల్లోనూ కొనసాగుతూనే ఉంది. తాజాగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశంలో కంచర్ల తన ధోరణిలో సుఖేందర్ రెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు గుత్తాకు తెలిశాయి.
అలాగే తన తనయుడు అమిత్ రెడ్డి హాజరైన చిట్యాల బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి హాజరు కాకుండా కంచర్ల తన నియోజకవర్గం నల్గొండ మండల ఆత్మీయ సమావేశానికి మంత్రిని తీసుకెళ్లిన తీరు కూడా గుత్తా వర్గీయుల్లో అసహనం రేకెత్తించింది.
ఇటీవల చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో కంచర్ల తన పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని భావిస్తున్న సుఖేందర్ రెడ్డి రామాలయ ప్రోటోకాల్ వివాదాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా భావిస్తున్నారు. తాజాగా కంచర్లకు, సుఖేందర్ రెడ్డి కి మధ్య రేగిన వివాదం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలను ఏమలుపు తిప్పుతాయోనన్న ఆసక్తి క్యాడర్లో వినిపిస్తుంది .