Site icon vidhaatha

Rahul Gandhi | మహిళల గౌరవంతో బీజేపీ ఆట.. బీజేపీ సర్కారుపై మండిపడిన రాహుల్‌

Rahul Gandhi

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం దాహంతో మహిళల‌ గౌరవం, దేశ ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నదని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో మహిళలపై జరిగిన అకృత్యాలకు సంబంధించిన పలు క్లిప్పింగ్‌లు ఉన్న ఒక వీడియోను రాహుల్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

ఇందులో ఇటీవల వెలుగు చూసిన మణిపూర్‌లో వివస్త్రలను చేసి ఇద్దరు మహిళల ఊరేగింపు, మహిళా రెజ్లర్లపై ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు, ఉత్తరాఖండ్‌లో బీజేపీ నాయకుడి కుమారుడు ఒకరు మహిళను హత్య చేసినట్టు వచ్చిన ఆరోపణలు, దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బల్కిన్‌ బానో కేసులో దోషుల ముందస్తు విడుదల తదితరాలు ఉన్నాయి.

‘మహిళలను గౌరవించని ఏ దేశమూ ప్రగతి సాధించజాలదు. అధికారంపై యావతో ఉన్న బీజేపీ.. మహిళల గౌరవంతోపాటు.. దేశ ఆత్మగౌరవంతో కూడా ఆటలాడుతున్నది’ అని రాహుల్‌ పోస్ట్‌ చేశారు.

Exit mobile version