Site icon vidhaatha

రాజ‌స్థాన్‌లో నోట్లో రెండు బాంబులు పేల్చుకొని యువ‌కుడి సూసైడ్‌



విధాత‌: రాజ‌స్థాన్‌లోని బ‌న్వారా జిల్లాలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఓ యువ‌కుడు రెండు బాంబులు నోట్లో పెట్టుకుని పేల్చుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మూడురోజుల క్రిత‌మే చెల్లి పెండ్లి జ‌రిగిన ఇంట్లో విషాదం నెల‌కొన్న‌ది. ఆ ఇల్లంతా ర‌క్త‌సిక్తంగా మారింది.


పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. జిల్లాలోని వ‌డియా కాల‌నీకి చెందిన హిమాన్షు (34) త‌న‌ త‌ల్లి మిథిలేశ్‌, చెల్లి భావ‌న‌తో క‌లిసి జీవిస్తున్నాడు. మూడ్రోజుల క్రిత‌మే చెల్లి భావ‌న వివాహాన్ని ఘ‌నంగా జ‌రిపించారు. త‌ల్లిని బాత్‌రూమ్‌లో పెట్టి తాళం వేసి హిమాన్షు భ‌యంక‌రంగా ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డ్డాడు. రెండు బాంబులు నోట్లో పెట్టుకొని పేల్చేసుకున్నాడు. త‌ల ఛిద్ర‌మై ఇల్లంతా ర‌క్త‌సిక్త‌మైంది. బాంబు పేలుడుతో శ‌బ్దం వ‌చ్చింది.


శ‌నివారం ఇంటికి వ‌చ్చి త‌లుపు త‌ట్ట‌గా ఎవ‌రూ స్పందించ‌లేదు. స్థానికుల స‌హకారంతో త‌లుపు విర‌గ్గొట్టి చూడగా ఇల్లంతా ర‌క్త‌సిక్తంగా మారింది. త‌న సోద‌రుడి త‌ల ఛిద్రమై విగ‌త‌జీవిగా ప‌డి ఉన్నాడు. పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో వారు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.


పోలీసుల కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 15 ఏండ్ల క్రితం హిమాన్షు తీవ్ర ప్ర‌మాదం బారిన ప‌డ్డాడ‌ని, నాటి నుంచి తీవ్ర మాన‌సిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడ‌ని, ఈ క్ర‌మంలో ఈ ఘాతుకానికి పాల్ప‌డి ఉండ‌వ‌చ్చ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.

Exit mobile version