ఇరాన్‌లో దారుణం చోటుచేసుకున్నది. బందర్‌అబ్బాస్ సమీపంలోని షహీద్ రజాయీ పోర్టులో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 520 మంది గాయపడి ఉంటారని అంచనా. మృతుల సంఖ్యపై ఇప్పటి వరకూ వివరాలు అందలేదు. ఈ ఘటనలో పోర్టులో ఉన్న అనేక కంటెయినర్లు పేలిపోయాయి. ఒక్కసారిగా పోర్టును భారీ అగ్నికీలలు, దట్టమైన నల్లని పొగ కమ్మేశాయి. ఇరాన్‌లోని అత్యంత అడ్వాన్స్‌డ్ పోర్టుల్లో ఇదొకటి.
మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని రీజినల్ పోర్ట్ అధికారి ఎస్మాయిల్ మలేకిజాదే వార్తా సంస్థలకు తెలిపారు. షహీద్ రజాయీ పోర్టు.. దేశ రాజధాని టెహరాన్‌కు దక్షిణంగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్‌లోని అత్యంత అధునాతన కంటెయినర్ పోర్ట్ ఇది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఐదోవంతు ఈ పోర్టు ద్వారానే రవాణా అవుతుంది.
#BREAKING: Massive explosion has rocked Iran’s Shahid Rajaee port in Bandar Abbas — leaving at least 500 injured. Blast ripped through the container zone, shattering windows kilometers away. Thick black smoke and a towering mushroom cloud were seen rising over the port. pic.twitter.com/GGJubrA1T9
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 26, 2025
పలు కంటెయినర్లు పేలిపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. గాయపడినవారిని సమీప హాస్పిటల్స్‌కు తరలిస్తున్నామని పేర్కొన్నాయి. అతిపెద్ద చమురు ఎగమతి స్థలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఆటంకం ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
🚨🇮🇷
THE EXPLOSION IN BANDER-ABBASHundreds of injured and dozens were killed in the mysterious explosion in the Bander Abbas port in Iran, which is known to be used by the IRGC not only to smuggle weapons to Hezbollah but also to launder money from crude oil sales to fund… pic.twitter.com/o3CoKIkGFt
— Voice From The East (@EasternVoices) April 26, 2025