పనామాసిటీ : బాంబు బెదిరింపు కాల్స్ వస్తే యావత్ విమానాశ్రయం వణికిపోతుంది. ఇక సదరు బాంబు ఉన్నదని ఫోన్ వచ్చిన విమానంలో ప్రయాణికుల సంగతి చెప్పనక్కర్లేదు. అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పడూ ప్రయాణికులు బెంబేలెత్తిపోతుంటారు. అమెరికాలోని పనామా సిటీ నుంచి ఫ్లారిడాలోని టాంపా వెళుతున్న కోపా ఎయిర్‌లైన్స్ విమానం బయల్దేరిన తర్వాత గంటసేపటికి టాయ్‌లెట్‌లో అనుమానాస్పదంగా ఒక ప్యాకెట్ కనిపించడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది హడలిపోయారు.
కాగా.. అది బాంబు అయి ఉండొచ్చన్న అనుమానంతో విమానాన్ని పనామాసిటీలోని టోక్యుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్డులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చాలా దూరంలో నిలిపి.. మొత్తం 144 మంది ప్రయాణికులను దించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇందుకోసం పేలుడు పదార్థాల విషయంలో నిపుణులైన బృందాన్ని పిలిపించారు. అనుమానాస్పదంగా టాయ్‌లెట్‌లో కనిపించిన ప్యాకెట్‌ను సైతం వారు పరీక్షించారు.
Unidades policiales en acción en el @tocumenaero, verifican una línea aérea. Velamos por la seguridad en todo momento. ✈️