Site icon vidhaatha

Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసానికి రూ.1000కోట్లు

Good News To Rajiv Yuva Vikasam Applicants: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సం సందర్భంగా రూ.1000 కోట్లు మంజూరు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం యువతకు ఆర్థికంగ చేయూతనిస్తూ..రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.

ఈ పథకం కింద 80శాతం సబ్సిడీతో రూ.50వేల నుంచి రూర.4లక్షల వరకు యువతకు స్వయం ఉపాధి కల్పనకు చిన్నతరహా పరిశ్రమ, వ్యాపార యూనిట్ల స్థాపనకు ఆర్థిక సహాయం అందించనున్నారు. లబ్ధిదారులను మండల స్థాయి కమిటీలు ఎంపిక చేసి జిల్లా స్థాయి కమిటీలకు అందచేస్తాయి. మార్చి 17నుంచి మొదలైన దరఖాస్తులు ఏప్రిల్ 14వరకు కొనసాగగా..లక్షల మంది యువత పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Exit mobile version