Sai Dhansika Wedding With Vishal: హీరో విశాల్ తో నటి సాయి ధన్సిక పెళ్లి కుదిరింది. తమ పెళ్లి విషయాన్ని హీరోయిన్ సాయి ధన్సిక చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్‌లో వేదిక మీదనే విశాల్ సమక్షంలోనే ప్రకటించింది. విశాల్ సైతం ఇదే వేదికపై స్పందిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించారు. విశాల్ అనుమతితో తాను తమ పెళ్లి ప్రకటన చేస్తున్నట్లుగా సాయి ధన్సిక ప్రకటించగా..ఆమె తల్లిదండ్రుల అనుమతితో మా పెళ్లి విషయాన్ని వెల్లడిస్తున్నట్లుగా విశాల్ ప్రకటించారు. గత కొంతకాలంగా హీరో విశాల్.. ధన్సికను వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో వారిద్ధరు పెళ్లి ప్రకటన చేయడంతో వారి మధ్య రూమర్స్ చెక్ పడింది. ఆగస్టు 29న వారిద్ధరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ రోజు విశాల్ పుట్టిన రోజు కావడం గమనార్హం.
మాది ప్రేమ వివాహామేనని వారిద్దరూ ప్రకటించారు. సాయి ధన్సిక నటించిన యోగి చిత్రం ఆడియో విడుదల ఈవెంట్ లో వారిద్ధరూ తమ పెళ్లి మూహుర్తాన్ని ప్రకటించడం విశేషం. తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ వయసు రానున్న ఆగస్టు నాటికి 48. ధన్సిక వయసు 35ఏళ్లు. వారి మధ్య 12ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్ ఆ సంఘం భవనం ప్రారంభోత్సవ తర్వాత వివాహాం చేసుకోనున్నట్లుగా ఇటీవల ప్రకటించడం గమనార్హం.