Site icon vidhaatha

Ram Pothineni | డ‌బుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ.. ఇక ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Ram Pothineni |

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ జోరు మాములుగా లేదు. మంచి సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న నేప‌థ్యంలో చిత్రంలో హీరోయిన్స్ కోసం, విలన్స్ కోసం ఇత‌ర భాష‌ల న‌టీన‌టులు ఆస‌క్తి చూపుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎక్కువ‌గా బాలీవుడ్ స‌రుకు దింపేది డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్. ఎక్కువ‌గా త‌న సినిమాలో హీరోయిన్స్‌ని ఇత‌ర భాష‌ల‌కి సంబంధించిన భామ‌ల‌ని ప‌ట్టుకొస్తాడు.

త‌న చివ‌రి సినిమా లైగర్ లో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండేని తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇక ఇప్పుడు మ‌రో బాలీవుడ్ బ్యూటీని ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్..హీరో రామ్‌తో క‌లిసి డ‌బుల్ ఇస్మార్ట్ అనే చిత్రం చేస్తున్నాడు.

బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తుండ‌గా, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది. చిత్రంలో క‌థానాయిక‌గా ఎవ‌రు న‌టిస్తున్నారు అనేది ఇంత వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఆ మ‌ధ్య రామ్ సరసన బేబీ మూవీ బ్యూటీ వైష్ణవి చైతన్య నటించనున్నట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ప్ర‌స్తుతం చిత్రంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సారా అలీ ఖాన్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈమూవీతో సారా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్ప‌టికే ఈ భామ షూటింగ్‌లో కూడా పాల్గొన్న‌ట్టు టాక్. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

సారా ఆల్రెడీ విజయ్ దేవరకొండతో లైగర్ లోనే డెబ్యూ చేయాల్సి ఉన్న‌ప్ప‌టికి అనుకోని ప‌రిస్థితిలో ఆమెని ప‌క్క‌క పెట్టారు. అప్పట్లో ఎందుకు కుదరలేదో గానీ.. ఇప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ కోసం సారాని తీసుకుంటారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే టాలీవుడ్‌కి మ‌రో అందాల భామ దొరికిన‌ట్టే.

Exit mobile version