Ratan Raajputh |
‘క్యాస్టింగ్ కౌచ్’ పదం తరుచుగా వినే ఉంటారు. ప్రతీ రంగంలో మహిళలు ఈ క్యాస్టింగ్ చౌక్‌ను ఎదుర్కొనే ఉంటారు. కానీ, సినీ పరిశ్రమలో మరింత ఎక్కువగా ఉంటుంది. సినిమాలు, సీరియల్స్ ఎలా ఎందులో తెరపై కనిపించాలంటే ఎక్కడో కాంప్రమైజ్ కావాల్సిందే.
ఇప్పటికే ఎంతో మంది ఈ క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డ వారు లేకపోలేదు. అదే సమయంలో కొందరు కమిట్‌మెంట్‌కు ఒప్పుకోక.. ఎంత కష్టపడ్డా చివరకు అవకాశాలు రాక ఇబ్బందులుపడ్డ వారు సైతం ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికే తమ జీవితంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ పరాభావాలను వెల్లడించారు.
తాజాగా హిందీ సీరియల్ నటి రతన్ రాజ్‌పుత్ ఇటీవల తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ముంబయిలో ఆడిషన్‌కు వెళ్తే కూల్‌డ్రింక్‌లో ఏదో మత్తుపదార్థం కలిపారని, దాన్ని తాగితే ఏదో తేడాగా అనిపించిందని పేర్కొంది. కాసేపటికి వాళ్లు ఓ అడ్రస్ చెప్పి అక్కడకు రమ్మనడం.. తీరా అక్కడికి వెళ్తే ఆ ప్రదేశం అంతా చెత్తగా, భయంకరంగా ఉందని, అమ్మాయి స్పృహ లేకుండా నేలపై పడి ఉండడంతో పరిస్థితి అర్థమై అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొంది.
క్యాస్టింగ్ కౌచ్ బాలీవుడ్‌లోనే కాదని.. దక్షిణాదిలోనూ ఆ పరాభావం ఎందురైందని పేర్కొంది. హిందీలో ‘అగ్లె జనం మోహె బిటియా హి కిజో’ సీరియల్ చేస్తున్న సమయంలో చాలా ఫోన్‌కాల్స్ వచ్చేవని చెప్పింది. కొందరు మంచి డైరెక్టర్స్ ఉండేవారని, మరికొందరు వక్రబుద్ధిని బయటపెట్టే వారని చెప్పుకొచ్చింది.
‘రతన్ మీరు చాలా సన్నబడ్డారు, కాస్త బరువు పెరిగితే కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అనేవారు. నేను వారి కండీషన్‌కు సైతం అంగీకరించాను. అప్పుడతడు ఇక్కడ విధివిధానాలు తెలిసే ఉంటాయి కదా అన్నాడు. అవేంటో ఒకసారి తెలుసుకోవచ్చా? అని అడిగాను.
అతడు బదులిస్తూ.. ఇక్కడ హీరో, దర్శకుడు, నిర్మాత, కొన్నిసార్లు సినిమాటోగ్రాఫర్ ఇలా ఎవరైనా సరే అడిగితే కాదనకూడదు అని సాగదీస్తున్నాడు. మీరేం చెప్పదల్చుకున్నారో సూటిగా చెప్పండంటే.. మీకు తెలిసిందేగా..! కాంప్రమైజ్ కావాలి’ అని చెప్పాడు. దాంతో ప్రాజెక్టు ఆఫర్‌ను తిస్కరించినట్లు చెప్పింది.
అప్పటి నుంచి తరకు దక్షిణాది నుంచి ఇప్పటి వరకు ఒక్క అవకాశం రాలేదని తెలిపింది. చాలా మంది బాలీవుడ్‌లోనే ఇలాంటివి జరుగుతాయని అంటుంటారని.. కానీ, సౌత్‌లోనూ ఇలాంటివి ఉన్నాయి. దక్షిణాదిలో అవకాశం పోయిందనే బాధ పడడం లేదని, అది తనకు పెద్ద విషయం కాదని రతన్ వివరించింది.