Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఉచ్చు బిగిసుకుంటుంది. ఆయన త్వరలోనే ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితులు ఒక్కోటిగా చుట్టుముడుతున్నాయ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు జారీ కాబడిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్ పంపించేందుకు యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఇటు సిట్ దర్యాప్తు బృందం కూడా ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలలో ఆయనపై ఉన్న అభియోగాలు..సేకరించిన ఆధారాలతో కూడిన నివేదిక ను అమెరికాకు అందించింది.
మరోవైపు నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావును జూన్ 20లోపు హాజరుకావాలని ఆదేశించింది. లేని పక్షంలో ప్రకటిత నేరస్తుడిగా గుర్తించి ఆయన ఆస్తుల స్వాధీనం జరుగుతుందని పేర్కొంది. దీంతో ప్రభాకర్ రావుకు అన్ని వైపుల చట్టపరమైన చక్రబంధం బిగుస్తుండటంతో ఆయన ఇండియాకు రాక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.