Site icon vidhaatha

Renu Desai | వేసవిలో వసంత గాలిలా కొందరు మన జీవితంలో వస్తారు..! రేణు దేశాయ్‌ ఎమోషన్‌ పోస్ట్‌..! పవన్‌ గురించేనా..?

Renu Desai | ప్రేమించి పెళ్లి చేసుకొని విభేదాల కారణంగా విడిపోయారు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రేణు దేశాయ్‌ (Renu Desai). పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన బద్రీ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పటి నుంచి ఇద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు. 2009, 20న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆ తర్వాత అభిప్రాయభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకున్నారు.

అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటారు. ఇక అప్పటి నుంచి రేణుదేశాయ్‌ మరో పెళ్లి చేసుకోకుండా.. పిల్లను చేసుకుంటూ జీవిస్తూ వస్తున్నారు. నిర్మాత, నటిగా సినీరంగంలో బిజీగా ప్రస్తుతం బిజీగా ఉన్నారు. రేణు ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ వస్తుంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ‘కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వేడి వేసవిలో చల్లని వసంత గాలిలా.. వారి చూపులతోనే నేరుగా మీ హృదయంతో మాట్లాడుతారు.

అది మనసుకి మాత్రమే తెలిసిన రహస్య భాష. మీరు వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ, వారి జ్ఞాపకాలు మాత్రం మీతో శాశ్వతంగా ఉండిపోతాయి. అయితే, ఆ జ్ఞాపకాలు కొద్దిసార్లు బాధను కూడా కలిగించవచ్చు. కానీ, కొంతమంది మాత్రం మీ కన్నీళ్లు తుడిచి ధైర్యాన్ని పంచుతారు. అలాగే నవ్వులు పరిచయం చేస్తారు’ అంటూ రాసుకొచ్చిన రేణుదేశాయ్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో ‘నేను నిన్ను నా కలల్లో, నిజంలో ఎప్పటికీ ఉంచుకుంటాను’ అంటూ ఉన్నది.

అయితే, పోస్ట్‌ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిందా? అంటూ పపన్‌ కల్యాణ్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇందు కూడా ఓ కారణం ఉంది. ఎందుకంటే ఇద్దరు కలిసిన నటించిన బద్రి సినిమా 2000 సంవత్సరంలో ఏప్రిల్‌లో విడుదలైంది. దాంతో పవన్‌ను ఉద్దేశించే రేణుదేశాయ్‌ పోస్ట్‌ పెట్టిందంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రేణుదేశాయ్‌ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version