Revanth Reddy | నా ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే.. నన్ను కొనేవాడు ఇంకా పుట్టలేదు: రేవంత్ భావోద్వేగం

Revanth Reddy రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు.. ఆలోచించి మాట్లాడు చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భావోద్వేగంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, విధాత: ‘నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు.. నా ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ నుంచి […]

  • Publish Date - April 21, 2023 / 11:55 PM IST

Revanth Reddy

  • రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదు
  • రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు.. ఆలోచించి మాట్లాడు
  • చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భావోద్వేగంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, విధాత: ‘నా జీవితంలో అన్నీ ఉన్నాయి.. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు.. నా ఏకైక లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ నుంచి రూ. 25 కోట్లు తీసుకున్నాడని చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన రేవంత్‌ మీరు అత్యంతగా విశ్వసించే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమానం చేద్దాం రమ్మని సవాల్‌ విసిరి, శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో చార్మినార్‌ భాగ్యలక్ష్మి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయానికి వెళ్లారు.

అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ను కొనేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు. కేసీఆర్ తో ఎలాంటి లాలూచీ లేదు.. రాజీ నా రక్తంలో లేదు.. భయం నా ఒంట్లో లేదని అన్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు తాను పోరాటం చేస్తానని అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు.

మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్‌ ఎస్‌ నుంచి డబ్బులు తీసుకుని ఉంటే… తన కుటుంబం సర్వ నాశనమైపోతుందని రేవంత్‌ అన్నారు. ఇది అమ్మవారి కండువా సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా అన్నారు. కేసీఆర్, కేటీఆర్ దోపీడీని బయటపెట్టినందుకు నన్ను జైల్లో పెట్టారన్నారు. జైల్లో ఉన్నన్నాళ్లు 16 రోజులు నిద్ర లేని రాత్రులు గడిపానని తెలిపారు. కేసీఆర్ ను ఎదుర్కొని నిటారుగా నిలబడ్డా రాజేంద్రా అని రేవంత్‌ అన్నారు.

నోటీసులు ఇవ్వగానే ఎవరికో తాను లొంగిపోలేదు రాజేంద్రా…నాపై,పార్టీపై ఆరోపణలు చేస్తావా అని ప్రశ్నించారు. ఇదేనా కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్వు ఇస్తున్న గౌరవం అని రేవంత్‌(Revanth Reddy) అడిగారు. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా అని అడిగారు. నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. కానీ తన పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కదా రాజేంద్రా అని అడిగాడు. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు.. ఆలోచించి మాట్లాడు.. నీపై కేసీఆర్ కక్ష కట్టినపుడు సానుభూతి చూపించామని రేవంత్‌ తెలిపారు.

ఇది రాజకీయం కాదు.. నా మనోవేదన రాజేంద్రా అని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు మంచివి కాదని హితవు పలికారు. ఇదేనా కేసీఆర్ తో కొట్లాడేవారికి ఇచ్చే గౌరవం అని అడిగాడు. అని ఈటెల ఆరోపణలపై మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన కొట్లాడటానికే మా జీవితాలు ధారేపోస్తున్నామని, నన్ను అమ్ముడు పోయారని అంటావా? రేవంత్ (Revanth Reddy) నిలదీశాడు. కేసీఆర్ సర్వం ధరపోసినా నన్ను కొనలేడని,ఇది చిల్లర రాజకీయం కాదు.. పోరాటం అని అన్నారు. తన నిజాయితీని శంకిస్తే మంచిది కాదన్నారు. తాను ఎవరికీ భయపడను.. నిటారుగా నిలబడి కొట్లాడుతానన్నారు.

పాల్వాయి సేవలను గుర్తించి మునుగోడు ఉప ఎన్నికల్లో స్రవంతికి పార్టీ టికెట్ కేటాయించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో రూ. 300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. అయితే ఒక్క రూపాయి, చుక్క మందు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని యాదగిరి గుట్టలో ప్రమాణం చేయాలని స్రవంతి సవాల్ విసిరిందని గుర్తు చేశారు.

25వేల మంది ఓటర్లు స్రవంతి పక్కన నిలబడ్డారన్నారు. ఈటెల రాజేందర్ వ్యవహార శైలి తాను గమనిస్తున్నానన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ కు రూ. 25కోట్లు సాయం చేశారని ఈటెల ఆరోపించారన్నారు. అయితే ఇది ఆరోపణ కాదు.. ఆధారాలు లేవని ఈటెల అన్నారని తెలిపారు. ఆధారాలు లేనపుడు అందరూ దేవుడిని నమ్ముతారని, అందుకే ఓట్టు వేయడానికి దేవాలయానికి రావాలన్నానని తెలిపారుre

Latest News