విధాత: దీక్షా దివస్ కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌ల మధ్య ట్విట్టర్ వార్‌కు తెర తీసింది. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని.. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేయగా. ఆమెకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. దీక్షా దివస్ కాదు అది దగా దివస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ గారు,దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి,తెలంగాణ రాష్ట్రం తెచ్చారు 2/3
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2022
రేవంత్ రెడ్డి కూడా కవిత ట్వీట్ పై మండిపడ్డారు. వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే.. బతుకమ్మ ఆడినందుకే.. బోనం కుండలు ఎత్తినందుకే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలను ఏమనాలి? అని ప్రశ్నించారు.
అమరవీరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది?
అందుకే… త్యాగాలు చేసిందెవరు… భోగాలు అనుభవిస్తోందెవరని యావత్ తెలంగాణ ఘోషిస్తోంది.
అధికార మదంతో మూసుకుపోయిన మీ కళ్లకు, చెవులకు అవి కనబడవు… వినబడవు.
2/2— Revanth Reddy (@revanth_anumula) November 29, 2022
చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారుల పై “ తుపాకీ ”ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం , బోనం మరియు బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2022