RGV |
శివ సినిమాతో తెలుగు సినిమా గమనాన్ని పూర్తిగా మార్చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన టాలీవుడ్, బాలీవుడ్‌కి ఎవర్ గ్రీన్ హిట్స్ అందించారు. కాని ఇప్పుడు మాత్రం ఆ వైభవం లేదు. వరుస ఫ్లాపులు తీస్తూ నిరుత్సాహపరుస్తున్నాడు. ముఖ్యంగా వర్మ కాంట్రవర్సీ సినిమాలు ఎక్కువగా తీస్తూ నిత్యం వార్తలలో నిలుస్తున్నాడు.
ప్రస్తుతం వ్యూహం అనే చిత్రం చేస్తుండగా, ఈ సినిమాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ టార్గెట్ గా చేసి తీస్తున్నాడు. ఈ సినిమాని ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయనున్నట్టు టాక్. అయితే వర్మ అందరికి చాలా భిన్నంగా ఉంటాడు. ఎవరు ఏమన్నా పట్టించుకోడు, సెంటిమెంట్స్ లేవంటాడు. దేవుడిని నమ్మనంటాడు, నచ్చిన పని చేసుకుంటూ పోతాడు.
ఇక సోషల్ మీడియాలో వర్మ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా వాటిని సమర్థించుకునే నైపుణ్యం ఆయన దగ్గర ఉంది. వర్మ గురించి గతంలో ఆయన తల్లి పలు విషయాలు చెప్పుకు రాగా, రాఖీ సందర్భంగా ఆయన సోదరి విజయ లక్ష్మి కూడా కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నారు.
రామ్ గోపాల్ వర్మకి కూడా సెంటిమెంట్స్ ఎమోషన్స్ ఉంటాయట, కానీ అవి అందరిలాగా కాదని ఆమె చెప్పుకొచ్చింది. వర్మకి ఆటంకం కలిగించే సెంటిమెంట్స్ అస్సలు ఫాలో కాడట. రాఖి కడతాను చేయి ఇవ్వు అంటే కచ్చితంగా తిడతాడని,అదే ఆయన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మెల్లగా వెళ్లి కట్టేస్తే తర్వాత అది చూసుకొని చాలా థ్రిల్ అవుతాడని వర్మ సోదరి చెప్పుకొచ్చింది.
అయితే తాను రాఖీ కట్టేందుకు కాసేపు ఫోన్ పక్కన పెట్టి రా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోడు. రాఖీ సమయంలో ఆయన చేయి దొరికితే అదే పెద్ద గిఫ్ట్. ప్రత్యేకంగా ఆయన ఏ గిఫ్ట్ ఇవ్వనక్కర్లేదు అని విజయ లక్ష్మీ చెప్పుకొచ్చారు.
ఇక కాలేజీలో ఒక అబ్బాయి తన వెంట పడుతున్నాడని తెలుసుకున్న వర్మ అతడిని చితకబాదాడని విజయలక్ష్మిగత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.ప్రస్తుతం వర్మ సోదరి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ హాట్ టాపిక్ అయ్యాయి. వర్మ స్టైలే సపరేట్ అని, ఆయనలా జీవించాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఎప్పటిలానే తిట్టిపోస్తున్నారు.