Site icon vidhaatha

Digvijaya Singh | నేను మీ అభిమానిని: దిగ్విజయ్ సింగ్

Digvijaya Singh

విధాత: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొత్త వివాదానికి తెరలేపారు. దళితులు, ముస్లింలు, వెనుక బడిన వర్గాలకు సమానహక్కులు కల్పించే కంటే బ్రిటిష్ పాలనలోఉండడానికే ఇష్టపడతానని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు ఎంఎస్ గోల్వాల్కర్ ‘వుయ్ అండ్ అవర్ నేషన్హుడ్ ఐడెంటిఫైడ్’ అనే పుస్తకంలో రాశారని దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీటు వివాదానికి కేంద్రబిందువు అయింది. ఆయనపై బీజేపీ కార్యకర్తలు కేసులు పెడుతున్నారు.

‘మోడీజీ, అమిత్ షాజీ, మీరు కొందరు నమ్మకద్రోహులైన పిరికిపందలను పోగేసుకుంటున్నారు. మిమ్మల్ని ఒకప్పుడు నిందించినవారు ఇప్పుడుపొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరు అధికారం కోల్పోతే ముందుగా మిమ్మల్ని వదలిపోయేదివారే. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీతో ఉన్నవారంతా ఎక్కడో దూరంగా ఇండ్లలో ఉండిపోయారు.. మీరు పెద్దతప్పు చేస్తున్నారు’ అని దిగ్విజయ్ సింగ్ మరొక ట్వీటులో పేర్కొన్నారు.

‘‘నేనుమీ విమర్శకుడిని. అలాగే కొనసాగుతాను. నేను బాగా వ్యతిరేకించే భావజాలానికి మీరు మనసా వాచా కట్టుబడి పని చేస్తున్నారు. ఆ విషయంలో నేను మీ అభిమానిని కూడా. మీకు సద్బుద్ధిప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అని దిగ్విజయ్ సింగ్ ఆ ట్వీటులో రాశారు.

Exit mobile version