కేర‌ళ‌లో రూ. 1200 కోట్ల విలువ చేసే హెరాయిన్ ప‌ట్టివేత

విధాత : కేర‌ళ‌లోని కొచ్చి పోర్టులో భారీగా హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. రూ. 1200 కోట్ల విలువ చేసే 200 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేసిన‌ట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ అధికారులు వెల్ల‌డించారు. ఈ మ‌త్తు ప‌దార్థాన్ని ఆప్ఘ‌నిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు తీసుకొచ్చి, అక్క‌డ్నుంచి భార‌త్‌కు, శ్రీలంక‌కు త‌ర‌లించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలింది. మొద‌ట‌గా ఆఫ్ఘ‌న్ నుంచి పాకిస్తాన్‌కు డ్ర‌గ్స్‌ను తీసుకొచ్చారు. అక్క‌డ ఇరానియ‌న్ బోటులో ఎక్కించి, కేర‌ళ‌లోని కొచ్చి పోర్టుకు త‌ర‌లించారు. కొచ్చి నుంచి […]

  • Publish Date - October 8, 2022 / 02:32 AM IST

విధాత : కేర‌ళ‌లోని కొచ్చి పోర్టులో భారీగా హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. రూ. 1200 కోట్ల విలువ చేసే 200 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేసిన‌ట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ అధికారులు వెల్ల‌డించారు. ఈ మ‌త్తు ప‌దార్థాన్ని ఆప్ఘ‌నిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు తీసుకొచ్చి, అక్క‌డ్నుంచి భార‌త్‌కు, శ్రీలంక‌కు త‌ర‌లించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు అధికారుల విచార‌ణ‌లో తేలింది.

మొద‌ట‌గా ఆఫ్ఘ‌న్ నుంచి పాకిస్తాన్‌కు డ్ర‌గ్స్‌ను తీసుకొచ్చారు. అక్క‌డ ఇరానియ‌న్ బోటులో ఎక్కించి, కేర‌ళ‌లోని కొచ్చి పోర్టుకు త‌ర‌లించారు. కొచ్చి నుంచి శ్రీలంక‌కు త‌ర‌లిస్తున్న క్ర‌మంలో భార‌త నేవీ అధికారుల స‌హాయంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు త‌నిఖీలు చేప‌ట్టి, 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ పాకెట్ల‌పై డ్రాగ‌న్, స్కార్పియ‌న్ ముద్ర‌లు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఇక హెరాయిన్‌ను త‌ర‌లిస్తున్న ఆరుగురు ఇరాన్ దేశ‌స్తుల‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Latest News