విధాత: అత్యవసర సేవలకు మాత్రమే అంబులెన్స్‌ను వినియోగిస్తారు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులను దవాఖానకు అంబులెన్స్‌ల్లో తరలిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి చేపల స్మగ్లింగ్‌కు ప్రభుత్వ అంబులెన్స్‌ను వాడాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది. స్థానికుల సమాచారంతో డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అంబులెన్స్‌ను కూడా సీజ్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా మధుగడ్ ఏరియాలో శుక్రవారం ఉదయం వేళ ఓ అంబులెన్స్ పదేపదే చక్కర్లు కొట్టడాన్ని స్థానిక మార్నింగ్ వాకర్లు గమనించారు. అంబులెన్స్ పదేపదే ఆ ప్రాంతంలోనే తిరగడంపై అనుమానం వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి బైక్‌పై అంబులెన్స్‌ను అనుసరించాడు.
जालौन..
उत्तर प्रदेश #सरकार की #एंबुलेंस से तीन बोरी मछलियां पकड़ी गई हैं।एंबुलेंस ड्राइवर से पूछताछ जारी है। pic.twitter.com/lbhNSZ8Gxj
— Amjad_AsR