Site icon vidhaatha

Sadhvi Niranjan Jyoti | మోదీ.. యోగి దేవదూతలు! దేశ వాతావరణాన్ని మార్చేశారు: సాధ్వి నిరంజన్‌ జ్యోతి

Sadhvi Niranjan Jyoti

విధాత: ప్రధాని మోదీని పొగిడేందుకు బీజేపీ నాయకులు తరచూ ఎక్కడలేని ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. మొన్నామధ్య హైదరాబాద్‌ మీటింగ్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.. మోదీని ఉద్దేశించి.. ‘దేవుడన్నా.. మోదీ’ అంటూ నెత్తికెత్తుకున్న సంగతి తెలిసిందే. ఇదే పద్ధతిలో తాజాగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి కూడా వ్యాఖ్యలు చేశారు.

ఆమె కంటికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఇద్దరూ దేవదూతల్లా కనిపిస్తున్నారట! అంతేకాదు.. దేశ వాతావరణాన్నే ప్రధాని మార్చివేశారని కితాబునిచ్చారు. కానీ.. ఏం మార్చారనేది మాత్రం వివరించలేదు. ఇతర ప్రధాన మంత్రులు కోరుకోని రీతిలో నూతన పార్లమెంటును మోదీ నిర్మించారని కొనియాడారు.

మోదీ వల్లే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు కూడా ఆయనతోనే సాధ్యమైందని ప్రశంసలు కురిపించారు. అక్కడితో ఆగని కేంద్రమంత్రి.. యావత్‌ ప్రపంచం మోదీని అభిమానిస్తున్నదని తేల్చేశారు.

Exit mobile version