Site icon vidhaatha

Samantha | ‘శాకుంతలం’ విడుదల వేళ సమంత డౌన్.. ఏంటి కథ?

విధాత‌, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే కాస్త కోలుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. అలాగే తను నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో కూడా విరివిగా పాల్గొంటుంది.

అయితే సడెన్‌గా ఆమె డౌన్ అయినట్లుగా ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. ‘శాకుంతలం’ ప్రమోషన్స్‌లో అసలు గ్యాప్ లేకుండా పాల్గొనడం కారణంగా.. తనకు జ్వరం ఇంకా గొంతునొప్పి వంటివి వచ్చాయని తన ట్వీట్‌లో పేర్కొంది. అయితే.. ఇక్కడే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిజంగా ఆమెకు ఫీవర్, గొంతు నొప్పి ఉండవచ్చు కానీ.. తను సింపతీని పొందడానికే ఇలా చేస్తుందనే వారు కూడా లేకపోలేదు. సమంత చేసిన ట్వీట్‌కు కొందరు నెటిజన్లు ఇలానే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అంతకుముందు ఆమె నటించిన ‘యశోద’ ప్రాజెక్ట్ విషయంలో కూడా కరెక్ట్‌గా ప్రమోషన్స్ మొదలెట్టి.. విడుదల చేసే సమయానికి ‘మయోసైటిస్’ అంటూ మీడియా ముందుకు ఒక ఫొటో వదిలింది. అందులో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లుగా ఉంది.

దీంతో ఆ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పుడు ‘శాకుంతలం’ విషయంలో కూడా అదే ఫార్ములాని సమంత ఫాలో అవుతుందా? అయితే ప్రతిసారి ఈ ఫార్ములా వర్కవుట్ కాదని సమంత ఎప్పుడు తెలుసుకుంటుందో? ఏమో? అనేలా కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఆమెకు బాలేదా? లేదంటే నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఏమైనా కథ ఉందా? ఏమో.. ఆ విషయం సమంత, ‘శాకుంతలం’ టీమ్‌కే తెలియాలి.

సమంత ట్వీట్‌లో.. ‘‘ఈ వారమంతా గ్యాప్ లేకుండా.. మీ మధ్యే ఉండి శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని.. మీ ప్రేమాభిమానాలు పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. వరుస షూటింగ్స్, ప్రమోషన్స్ వల్ల సడెన్‌గా అనారోగ్యానికి గురయ్యాను. జ్వరం వల్ల నా శరీరం సత్తువను కోల్పోయింది. అలాగే గొంతును కూడా పొగొట్టుకున్నాను.

ఈ రోజు సాయంత్రం ‘ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ’లో జరిగే వార్షికోత్సవంలో నేను పాల్గొనలేకపోతున్నాను. మీ అందర్ని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. శాకుంతలం టీమ్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించండి’’ అని సమంత తన ట్వీట్‌లో పేర్కొంది. సమంత విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్’ అనే సిరీస్‌తో పాటు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది.

Exit mobile version