Same Gender Marriage | స్వ‌లింగ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త అంశం.. రాజ్యాంగ ధ‌ర్మ‌స‌నానికి సుప్రీం సిఫార‌సు

Same Gender Marriage | స్వ‌లింగ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాలంటూ సుప్రీంకోర్టు( Supreme Court )లో పిటిష‌న్లు దాఖ‌లైన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని( Union Govt ) వివ‌ర‌ణ కోర‌గా.. స్వ‌లింగ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌లేమ‌ని కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై సీజేఐ జ‌స్టిస్ డివై చంద్ర‌చూడ్‌( Justice DY Chandrachud ), జ‌స్టిస్ పీఎస్ న‌ర‌సింహ‌, జ‌స్టిస్ జేబీ పార్ధివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం సోమ‌వారం విచార‌ణ […]

  • Publish Date - March 13, 2023 / 03:25 PM IST

Same Gender Marriage | స్వ‌లింగ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాలంటూ సుప్రీంకోర్టు( Supreme Court )లో పిటిష‌న్లు దాఖ‌లైన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని( Union Govt ) వివ‌ర‌ణ కోర‌గా.. స్వ‌లింగ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌లేమ‌ని కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ అంశంపై సీజేఐ జ‌స్టిస్ డివై చంద్ర‌చూడ్‌( Justice DY Chandrachud ), జ‌స్టిస్ పీఎస్ న‌ర‌సింహ‌, జ‌స్టిస్ జేబీ పార్ధివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. స్వ‌లింగ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ల‌ను అన్నింటిని ఐదుగురు స‌భ్యుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి సిఫారుసు చేశారు.

ఈ కేసు ఒక‌వైపు రాజ్యాంగ హ‌క్కులు, మ‌రో వైపు ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం, ప్ర‌త్యేక శాస‌న చ‌ట్టాల‌తో ముడిప‌డి ఉంద‌ని కోర్టు వ్యాఖ్యానించింది. కాబ‌ట్టి ఈ అంశం చాలా ముఖ్య‌మైంది.. దీనిపై విస్తృత ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌లేమ‌ని, ఇది భార‌తీయ కుటుంబ వ్య‌వ‌స్థ‌కు విరుద్ధ‌మ‌ని కేంద్ర పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఇలాంటి వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తే వ్య‌క్తిగ‌త చ‌ట్టాలు, సామాజిక విలువ‌ల సున్నిత స‌మ‌తౌల్య‌త పూర్తిగా దెబ్బ‌తింటుంద‌ని కేంద్రం తెలిపింది.

Latest News