Mancherial | 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష: భట్టి విక్రమార్క

రైతుబంధు తరహాలోనే రైతు కూలీలకు పథకం తుమ్మిడిహట్టి పూర్తి చేసి.. చెన్నూరు రైతుల కాళ్లు కడుగుతాం పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విథాత బ్యూరో,కరీంనగర్:  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాడుతున్న రాహుల్ గాంధీపై అక్రమ కేసు పెట్టి, జైలు శిక్ష పడేలా చేసి, పార్లమెంటు అనర్హత వేటు వేసిన బిజెపి కుట్రలను నిరసిస్తూ ఈనెల 8న మంచిర్యాల జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి […]

  • Publish Date - April 3, 2023 / 02:04 AM IST

  • రైతుబంధు తరహాలోనే రైతు కూలీలకు పథకం
  • తుమ్మిడిహట్టి పూర్తి చేసి.. చెన్నూరు రైతుల కాళ్లు కడుగుతాం
  • పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

విథాత బ్యూరో,కరీంనగర్: ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాడుతున్న రాహుల్ గాంధీపై అక్రమ కేసు పెట్టి, జైలు శిక్ష పడేలా చేసి, పార్లమెంటు అనర్హత వేటు వేసిన బిజెపి కుట్రలను నిరసిస్తూ ఈనెల 8న మంచిర్యాల జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

చెన్నూరు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని కాపాడుకోవడం అంటే ఈ దేశాన్ని కాపాడుకోవడమే అన్నారు. కనీసం సొంత ఇల్లు లేని రాహుల్ గాంధీని క్వార్టర్ ఖాళీ చేయాలనడం బిజెపి కక్ష్య సాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు.

రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బిజెపి కుట్రలను తిప్పి కొట్టడానికి దేశ ప్రజలంతా రాహుల్ గాంధీ వెంటే ఉన్నారని చెప్పారు. మంచిర్యాలలో జరిగే సత్యాగ్రహ దీక్షలో ఏఐసీసీ, పీసీసీ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ దీక్షా కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అధికార బిఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలలో చెన్నూరు నియోజకవర్గం అన్యాయం అవుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తే చెన్నూరు సస్యశ్యామలం అయ్యేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చెన్నూరు ప్రజలకు పెద్ద శాపంలా మారిందన్నారు.

కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూరు ప్రజలు వరద ముంపునకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గోదావరి నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టాలన్న సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.

కాంగ్రెస్ హయంలో 15 వేల ఎకరాలకు నీరందించేందుకు రూపకల్పన చేసిన గొల్లవాగు ప్రాజెక్టు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామరూపాలు లేకుండా పోయిందన్నారు. గొల్లవాగు కాలువల మెయింటెనెన్స్ ను ప్రభుత్వం విస్మరించడంతో పుాడిక చేరి 400 ఎకరాలకే సాగునీరు అందించే దుస్థితికి చేరుకొందన్నారు.

సింగరేణి ప్రైవేటీకరణతో జైపూర్ లాంటి పవర్ ప్రాజెక్టులో చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 15 వేల ఎకరాలకు సాగు నిర్వహించే గొల్లవాగు కాలువలు పూర్తి చేస్తామన్నారు.

తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి..చెన్నూరు నియోజకవర్గ రైతుల కాళ్లు కడుగుతామని అన్నారు. పోడు భూముల పంచి పట్టాలు పంపిణీ చేస్తామని, ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించి టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా కొలువులను భర్తీ చేస్తామని, రైతుబంధు తరహాలోనే భూమిలేని కూలీలకు కూలి బందు పథకం తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Latest News