విధాత: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఓ సరికొత్త రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. అమృత్ కలాష్ డిపాజిట్ పేరుతో పరిచయమైన ఈ స్కీంలో అధిక వడ్డీరేటును కస్టమర్లకు ఎస్బీఐ అందిస్తున్నది.
సాధారణ కస్టమర్లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.6 శాతం వడ్డీరేటును ఎస్బీఐ ఆఫర్ చేస్తున్నది. డిపాజిట్ వ్యవధి 400 రోజులు. దేశీయ, ఎన్నారై కస్టమర్లకు అమృత్ కలాష్ డిపాజిట్ స్కీం ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్బీఐ చెప్పింది.
కస్టమర్లకు SBI షాక్.. పెరగనున్న క్రెడిట్ కార్డ్ చార్జీలు
ఈ టర్మ్ డిపాజిట్‌పై వడ్డీని నెల, త్రైమాసిక, అర్ధవార్షికంగా ఎస్బీఐ చెల్లిస్తుంది. నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోనే జమ అవుతుంది. అయితే ఆదాయ పన్ను (ఐటీ) చట్టం ప్రకారం టీడీఎస్ వర్తిస్తుందని బ్యాంక్ తెలియజేసింది. డిపాజిట్ ప్రీమెచ్యూర్, రుణ సదుపాయాలు ఉంటాయి.