Site icon vidhaatha

అదానీ వ్యవహారంపై సెబీ దర్యాప్తు.. రేపు ఆర్థిక శాఖకు నివేదిక..!

Adani Enterprises | అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ నివేదిక వ్యవహారంపై సెబీ విచారణ జరుపుతున్నది. ఈ నెల 15న ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ అంశంపై నివేదికను సమర్పించనున్నది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO)ను పరిశీలిస్తోంది. ఇందులో ఏమైనా అవకతవకలు జరిగాయా? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నది. అయితే, సెబీ ఇప్పటికే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20వేలకోట్ల ఎఫ్‌పీవో విచారణ నిర్వహిస్తుంది. పూర్తి సబ్‌స్క్రైబ్‌ అయిన తర్వాత కంపెనీ పబ్లిక్‌ ఇష్యూను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

ఏడుశాతం పడిపోయిన అదానీ గ్రూప్‌ షేర్లు

అదానీ గ్రూప్‌ షేర్లు సోమవారం ఏడుశాతం వరకు పతనమయ్యాయి. చాలా షేర్లు లోయర్‌ సర్క్యూట్‌లోనే ముగియడంతో గ్రూప్‌ ఆదాయ వృద్ధి లక్ష్యం సాగానికి తగ్గింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 125 బిలియన్‌ డాలర్లు తగ్గింది. జనవరి 24 నాటికి రూ.19.20లక్షల కోట్లుగా… సోమవారం నాటికి రూ.9లక్షలకోట్లు పడిపోయి.. రూ.8.99లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో సోమవారం గౌతమ్‌ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితాలో 23వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం అదానీ సంపద 54.4బిలియన్‌ డాలర్లకు తగ్గింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక కంటే ముందు 120బిలియన్‌ డాలర్లుగా ఉండేది.

Exit mobile version