Site icon vidhaatha

Nalgonda | షీ టీమ్ కౌన్సిలింగ్.. యువకుడి ఆత్మహత్య! ఉద్రిక్తత

విధాత: నల్గొండ జిల్లా చండూర్ మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన అబ్బనబోయిన శివ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని శివ వేధిస్తున్నడంటూ షీ టీమ్‌లో అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కౌన్సిలింగ్ పేరుతో షీ టీమ్ పోలీసులు శివను స్టేషన్‌కు పిలిపించి చితకబాదారని, మళ్ళీ స్టేషన్‌కు రావాలంటూ బెదిరించడంతో మనస్తాపం చెంది అతను ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పోలీసుల దెబ్బలకు భయపడి శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహాన్ని పోలీసులు ఇంటి వద్దకు చేర్చే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుతోనే శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఆగ్రహంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పోలీసులకు, గ్రామస్తులకు మద్య తోపులాటతో ఉధృత నెలకొంది మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బాధ్యులైన షీ టీమ్ పోలీసులను, సీఐని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అనంతరం శివ మృతదేహాన్ని తీసుకొని బాలిక ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.

Exit mobile version