బాల రాముడి ప్రాణప్రతిష్ట చూపిస్తూ.. మెద‌డులో క‌ణితి తొల‌గించిన వైద్యులు

ప్రాణ‌ప్రాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాల‌ను కాపాడే వారు వైద్యులు. ఏ రోగ‌మొచ్చినా దానికి అనుగుణంగా వైద్యం చేసి మ‌న‌షుల‌ను బ‌తికిస్తారు.

  • Publish Date - February 20, 2024 / 10:22 AM IST

గుంటూరు: ప్రాణ‌ప్రాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాల‌ను కాపాడే వారు వైద్యులు. ఏ రోగ‌మొచ్చినా దానికి అనుగుణంగా వైద్యం చేసి మ‌న‌షుల‌ను బ‌తికిస్తారు. అసాధార‌ణ ప‌రిస్థితుల్లోనూ త‌మ‌కున్న నైపుణ్యంతో విజ‌య‌వంతంగా ట్రీట్‌మెంట్ చేసి, రోగి ప్రాణాల‌ను నిల‌బెడుతారు. అయితే ఓ వ్య‌క్తి మెద‌డులో ఉన్న క‌ణితిని తొల‌గించేందుకు వైద్యులు.. అత‌నికి బాల‌రాముడి ప్రాణ‌ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని చూపిస్తూ స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. మొత్తానికి డాక్ట‌ర్లు ఆ వ్య‌క్తికి స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా నిర్వ‌హించి, క‌ణితిని తొల‌గించారు. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.


గుంటూరు జిల్లా చేబ్రోలు మండ‌లం గొడ‌వ‌ర్రు గ్రామానికి చెందిన దాన‌బోయిన మ‌ణికంఠ‌(29)కు మెద‌డులో అత్యంత కీల‌క‌మైన ప్రాంతంలో 7 సెం.మీ. క‌ణితి ఉన్న‌ట్లు వైద్యులు గుర్తించారు. అయితే మెద‌డులోని కీల‌క ప్రాంతంలో క‌ణితి ఉండ‌టంతో.. రోగి మెల‌కువ‌గా ఉన్న‌ప్పుడే స‌ర్జ‌రీ చేయాల‌ని వైద్యులు డిసైడ్ అయ్యారు. దీంతో రోగికి ఇష్ట‌మైన బాలరాముడి ప్రాణప్ర‌తిష్ఠ వీడియోను చూపిస్తూ స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. క‌ణితిని తొల‌గించారు. ప్ర‌స్తుతం మ‌ణికంఠ కోలుకుంటున్నాడ‌ని, ఆరోగ్యంగా ఉన్నాడ‌ని వైద్యులు తెలిపారు.

మెదడులోని కీలక ప్రాంతం కాబట్టి రోగి మెలకువగా ఉన్నప్పుడే సర్జరీ చేయాలని రోగికి ఇష్టమైన బాల రాముడి ప్రాణప్రతిష్ట వీడియో చూపిస్తూ డాక్టర్లు సర్జరీ చేశారు.

Latest News