Site icon vidhaatha

Devara Movie | దేవరతో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ రొమాన్స్‌..!

Devara Movie | జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. రెండు భాగాల్లో రానున్న ఈ చిత్రం.. తొలి భాగం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్నది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. డిజాస్టర్‌ మూవీ ఆచార్య తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ ఈ మూవీని చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు.


ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్‌. ఈ చిత్రంలో అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్‌ నటిస్తున్నది. ఈ చిత్రంలో తెలుగులోకి జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా మరాఠి భామ శ్రుతిని తీసుకున్నట్లు తెలుస్తున్నది. దాంతో పాటు మూడో హీరోయిన్‌ను సైతం తీసుకోనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ దేవర చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కీలక పాత్రలోనే శ్రద్ధా నటిస్తున్నట్లుగా లేటెస్ట్‌ టాక్‌.


ఇదే నిజమైతే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నట్లుగా తెలుస్తున్నది. దేవర తొలి భాగం ఈ ఏడాది అక్టోబర్‌ 10న దసరాకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌కొట్టాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ భావిస్తున్నాడు. మరో వైపు ఆర్‌ఆర్‌ఆర్‌ విజయం తర్వాత ఎన్టీఆర్‌ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో దేవర చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషనల్‌ వస్తున్న రెండో చిత్రం ఇది.


ఇప్పటికే జనతా గ్యారేజ్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌ హిట్‌ సాధించింది. దాంతో ఈ చిత్రం సైతం భారీగా విజయాన్ని సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరో వైపు ఎన్టీఆర్‌ వార్‌-2 చిత్రంలో నటిస్తున్నాడు. అయాన్‌ ముఖర్జీ నటిస్తుండగా.. హృతిక్‌ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్‌ నటించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నది. మరో వైపు శ్రద్ధా కపూర్‌ ప్రస్తుతం స్ట్రీ-2 చిత్రంలో నటిస్తున్నది.

Exit mobile version