Ind vs WI |
వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. మొదటి రెండు టీ20లలో పెద్దగా సత్తా చాటలేకపోయిన భారత యువక్రికెటర్స్ మూడో టీ20 మ్యాచ్ నుండి దుమ్ములేపుతున్నారు. సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20 మ్యాచ్‌లో 179 పరుగుల భారీ లక్ష్యాన్ని యంగ్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ సులభంగా ఊదేశారు. దీంతో సిరీస్ 2-2 తో సమం అయింది.
ఆదివారం జరిగే చివరి టీ 20 మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికి కప్ దక్కనుంది. అయితే నాలుగో టీ 20లోను విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఒకవైపు వికెట్స్ పడుతున్నా కూడా వారు ఎక్కడా స్కోరు తగ్గకుండా చూసుకున్నారు. విండీస్ బ్యాట్స్‌మెన్స్‌లో సిమ్రాన్ హెట్మయర్ హాఫ్ సెంచరీ, షై హోప్ మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగుల స్కోరు చేయగలిగింది.
ఇక భారీ లక్ష్యం భారత్ ముందు ఉండడంతో టీమిండియా ప్రేక్షకులలో ఒకింత టెన్షన్ నెలకొంది. తొలి టీ20లో 150 పరుగులే చేయలేక చతికిలపడ్డారు. ఇంత స్కోరు చేదిస్తారా అని అనుకున్నారు. కాని రెండో టీ20 ఆడుతున్న యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో టార్గెట్ సాధించడం సులువు చేశాడు.
మరోవైపు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన శుబ్‌మన్ గిల్ తర్వాత స్పీడ్ పెంచి భారీగానే పరుగులు రాబట్టాడు. వీరిద్దరు కలిసి వెస్టిండీస్ బౌలర్లపై బౌండరీలతో దండెత్తడంతో టీమిండియా స్కోరు 7 ఓవర్లలోనే స్కోరు 100 పరుగులకు చేరుకుంది . విండీస్ టూర్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శుబ్‌మన్ గిల్ రెండో టీ 20 మ్యాచ్‌లో మాత్రం 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
ఇక రెండో టీ20 ఆడుతున్న యశస్వి జైస్వాల్.. 33 బంతుల్లో అర్ధం సెంచరీ పూర్తి చేసి అదరహో అనిపించాడు. ఈ క్రమంలో టీమిండియా తరుపున టీ20ల్లో అర్ధం సెంచరీ చేసిన నాలుగో అతి పిన్న వయస్కుడిగా యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. యశస్వి జైస్వాల్ 21 ఏళ్ల 227 రోజులుగా ఉన్నప్పుడు అర్ధ సెంచరీ చేయగా, అంతకన్నా ముందు రోహిత్ శర్మ, తిలక్ వర్మ, రిషబ్ పంత్ ఉన్నారు.
ఇక టీ20ల్లో టీమిండియాకి గిల్- యశస్వింది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. గత ఏడాది దీపక్ హుడా- సంజూ శాంసన్ కలిసి 176 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టాప్‌లో ఉండగా, అంతకముందు శ్రీలంకపై రోహిత్ శర్మ- కెఎల్ రాహుల్ 165 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇప్పుడు దీనిని యశస్వి జైస్వాల్- శుబ్‌మన్ గిల్ సమం చేశారు