Singer Mangli |
విధాత: ప్రముఖ గాయని మంగ్లీ రాథోడ్ (singer mangli)కు ప్రమాదం జరిగింది. తెలంగాణలో బోనాల సందర్భంగా ఓ ప్రైవేట్ పాట చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో మంగ్లీ కాలు జారి కింద పడ్డారు.
దీంతో ఆమె కాలికి గాయమైంది. వెంటనే యూనిట్ సభ్యులు మంగ్లీని హైదరాబాదులో ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.