Site icon vidhaatha

Odisha | ఒడిశాలో మ‌రో ఘోరం.. భారీ ఈదురు గాలుల‌కు క‌దిలిన గూడ్స్ రైలు.. ఆరుగురు మృతి

Odisha | ఒడిశాలో కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ఘ‌ట‌న మ‌రువ‌క ముందో మ‌రో ఘోర జ‌రిగింది. ఓ గూడ్స్ రైలు ఆరుగురి ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న‌ది. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని జాజ్‌పూర్ కోయిన్‌జాన్ రోడ్ రైల్వేస్టేష‌న్ వ‌ద్ద ఓ గూడ్స్ రైలు ఆగింది.కానీ దానికి ఇంజిన్ లేదు. అయితే బుధ‌వారం భారీ వ‌ర్షం కురియ‌డంతో స్టేష‌న్ ప‌క్క‌నే ప‌ని చేస్తున్న కూలీలు గూడ్స్ రైలు కింద త‌ల‌దాచుకున్నారు.

భారీ ఈదురుగాలుల‌కు గూడ్స్ రైలు ముందుకు క‌ద‌ల‌డంతో ఆరుగురు కూలీలు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో ఇద్ద‌రు కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డటంతో చికిత్స నిమిత్తం క‌ట‌క్‌లోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

బాధిత కూలీలంతా రైల్వే ప‌నులకు వ‌చ్చిన వారేన‌ని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ఒక్క‌సారిగా ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం కురియ‌డంతో గూడ్స్ రైలు కింద‌కు వ‌చ్చారు. గూడ్స్ బోగీలు కూడా గాలికి ముందుకు క‌ద‌ల‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాద ఘ‌ట‌న‌లో 288 మంది ప్ర‌యాణికులు మృతి చెందిన విష‌యం విదిత‌మే. దాదాపు 1200 మంది ప్ర‌యాణికులు తీవ్రంగా గాయ‌ప‌డి వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version