Site icon vidhaatha

Sriram Sagar | నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

Sriram Sagar | విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయని, నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద ఉన్న శ్రీరామ్ సాగర్ జలాశంలోకి భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలోకి ఇన్ ఫ్లో 21556 క్యూసెక్కులు వరద కొనసాగుతుంది. రెండు గేట్ల ద్వారా దిగివ గోదావరిలోకి 19500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1091.332 అడుగులకు గాను, ప్రస్తుతం1091 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90.3 టీఎంసీలకు గాను 90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఏ సమయంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి , వరద నీరు గోదావరి నదిలోకి వదిలే అవకాశం ఉందని, నదీ దిగువ పరివాహక ప్రాంతంలోకి పశువులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం ఉండాలని, పోలీస్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు.

Exit mobile version