విధాత : దొంగల్లో వింత దొంగలు వేరయా అన్నట్లుగా ఓ దొంగ చోరికి వచ్చి వచ్చిన పని చూసుకొని వెళ్లిపోకుండా మూడు రోజుల పాటు అత్తారింటిలా అదే ఇంట్లో దర్జా వెలగబెట్టి.. మందు తాగుతూ మత్తుగా పడుకుని దొరికిపోయిన ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటుచేసుకుంది. పట్టణంలోని సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి సొంతూరు అలజంగికి వెళ్లాడు. చోరీలతో కాలం గడిపే ఓ దొంగ శ్రీనివాస్ రావు ఇంట్లో ఎవరూ లేరని గమనించి..ఇంటి తాళం పగులగొట్టి లోనికి చొరబడ్డాడు. అ
యితే చోరి చేసి వెళ్లిపోకుండా మూడు రోజుల నుంచి ఇంట్లోని వెండి, ఇత్తడి సామాన్లు తీసుకెళ్లి అమ్ముకుంటూ ..వచ్చిన డబ్బుతో మద్యం తాగి తిరిగి అదే ఇంటికి చేరుకుని దర్జాగా మత్తులో నిద్రపోతున్నాడు. వింత దొంగ నిర్వాకాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు పెద్దగా కష్టపడకుండానే తాగి మత్తుగా ఇంట్లో నిద్రపోతున్న దొంగను పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.