విధాత : తనను తోటి విద్యార్థుల ముందు తిట్టాడనే కోపంతో ఓ విద్యార్థి టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఓ ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. ఇద్దరిలో ఒకర్ని టీచర్ మందలించాడు. దీంతో ఆ టీచర్‌పై సదరు విద్యార్థి కోపం పెంచుకున్నాడు.
ఇక ఒంటరిగా వెళ్తున్న టీచర్‌పై దేశీ తుపాకీతో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన సమయంలో అక్కడున్న వారిలో కొందరు విద్యార్థిని పట్టుకుని, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బాధిత ఉపాధ్యాయుడిని చికిత్స నిమిత్తం లక్నోలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.