Love Marriage | పాట్నా : ఓ అమ్మాయి( Student ).. తన టీచర్( Teacher )ను పెళ్లాడింది. ఆ తర్వాత తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను( Police ) ఆ నవ దంపతులు వేడుకున్నారు. ఈ ఘటన బీహార్( Bihar )లోని జముయి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జముయి జిల్లాకు చెందిన ఓ యువతి ఇంటర్ చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో కూడా ప్రవేశం పొందింది. ఇక అక్కడ కోచింగ్ ఇచ్చే టీచర్ ప్రభాకర్ మహతోపై ఆమె మనసు పారేసుకుంది. టీచర్ కూడా ఆమె ప్రేమను అంగీకరించాడు.
ప్రభాకర్ మహతో కూడా ఆరు నెలల క్రితం పోలీసు జాబ్ కొట్టాడు. ఇక జీవితంలో అతను సెటిలవ్వడంతో.. ప్రేమ విషయాన్ని ఇరువురు తమ తల్లిదండ్రులకు తెలిపారు. కానీ ఇరు కుటుంబాల నుంచి వీరి ప్రేమ పెళ్లికి అంగీకారం లభించలేదు.
దీంతో చేసేదేమీ లేక చివరకు.. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తనకు 18 ఏండ్లు నిండాయని, ఇష్టపూర్వకంగా ప్రభాకర్ సార్‌ను పెళ్లి చేసుకున్నానని యువతి చెప్పింది. ఈ క్రమంలో తమ తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని నవ దంపతులు పోలీసులను వేడుకున్నారు.
తనను ప్రభాకర్ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేసింది. ఇష్టంతోనే ఆయనను వివాహం చేసుకున్నానని, ఇందులో ఎవరి బలవంతం లేదని తేల్చిచెప్పింది. తమను ప్రశాంతంగా బతకనివ్వండి అని కుటుంబ సభ్యులను వేడుకుంది.