ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ ఓపెన్‌గా మాట్లాడుతూ ఆశ్చర్య పరుస్తున్నారు. తమ కెరియర్‌లో జరిగిన కొన్ని విచిత్ర పరిస్థితుల గురించి చెబుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఒకప్పటి అందాల తార సుహాసిన తాజాగా హీరో ఒళ్లో కూర్చోమనడమే కాకుండా, ఎంగిలి ఐస్‌క్రీమ్ కూడా తినమన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
సుహాసిని విషయానికి వస్తే ఆమె 1980, 90లలోతెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. స్టార్ కిడ్‌గానే సుహాసిని సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. కమల్ హాసన్ అన్న కూతురైన సుహాసిని మణిరత్నంని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తాను సపోర్టింగ్ పాత్రలలో కనిపిస్తూ మెప్పిస్తుంది.
తాజాగా, సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న సుహాసిని తన జీవితంలో జరగిన కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి తెలియజేసింది. తన కెరీర్ బిగినింగ్‌లో.. హీరోయిన్‌గా చేసేటప్పుడు ఎన్నో విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్టు పేర్కొంది.
కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో యాక్ట్ చేయాల్సి వస్తే.. నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసే దానిని. ఒకసారి ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం చేయాలంటూ డైరెక్టర్ నాపై ఒత్తిడి చేయగా, చేయనని మొహం మీదే చెప్పాను.
మరో సన్నివేశంలో హీరో తిన్న ఎంగిలి ఐస్ క్రీం తినాలని చెప్పగా, వేరే వాళ్లు ఎంగిలి చేసిన ఐస్ క్రీం నేను తినడం ఏంటని డైరెక్టర్‌కు గట్టిగా ఇచ్చిపడేశా అని సుహాసిని పేర్కొంది. వేరే ఐస్‌క్రీమ్ తీసుకురండి లేదంటే సీన్ అయినా మార్చమని చెప్పాను.
అప్పుడు కొరియోగ్రాఫర్ ఒప్పుకోకుండా, తను చెప్పింది చేయమని చెబితే నేను అస్సలు ఒప్పుకోలేదు. ఆ ఐస్‌క్రీమ్ ముట్టుకోనని కూడా చెప్పాను. ఇలాంటి పరిస్థితులు నా ఫ్రెండ్ శోభనకి కూడా ఎదరైందని పేర్కొంది. శోభన అలాంటి సీన్ చేయనని చెప్పడంతో దర్శకుడు ఆమెను తిట్టాడు.
అప్పుడు నువ్వేమన్నా సుహాసిని అనుకుంటున్నావా? అన్నాడంట. ఆ విషయం శోభన నాకు ఫోన్ చేసి చెప్పిందని తాజాగా తెలియజేశారు సుహాసిని. మణిరత్నం సతీమణిగా ఉన్న సుహాసిని ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాలలో అప్పుడప్పుడు మెరుస్తుంది. సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది.