Site icon vidhaatha

Sukesh | నోటీసులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు: కేటీఆర్, కవితలపై అమిత్‌షాకు సుకేశ్ ఫిర్యాదు

Sukesh |

విధాత: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలతో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితలకు వ్యతిరేకంగా మరో లేఖ విడుదల చేశారు.

ఈసారి కేంద్ర మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తాను ఇప్పటికే మంత్రి కేటీఆర్‌, కవితలపై తెలంగాణ గవర్నర్‌కు, సీబీఐకి ఫిర్యాదు చేశానని లేఖలో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై కేటీఆర్ అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని సుకే్‌శ్‌ ఆరోపించారు. లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ ఒత్తిడి చేస్తున్నారని, అనుచరులను ఉసిగొల్పుతున్నారని లేఖలో అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటివరకు కేటీఆర్‌, కవితలపై తాను చేసిన ఫిర్యాదులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుకేశ్ తన లేఖలో అమిత్‌షాను కోరారు.

Exit mobile version