Site icon vidhaatha

Surat | 118 కోట్ల బ్రిడ్జి.. 40 రోజుల‌కే ప‌గుళ్లు..

Surat

విధాత‌: ప్ర‌ధాని మోదీ సొంత రాష్ట్రంలో నిర్మాణ ప‌నులు అత్యంత నాసిర‌కంగా జ‌రుగుతాయ‌నే విమ‌ర్శ‌ల‌కు ఈ చిత్రాలే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. సూరత్‌లోని తాపీ నదిపై కొత్తగా నిర్మించిన వేద్-వరియావ్ వంతెనపై నిలువునా పగుళ్లు వచ్చాయి.

దాదాపు 118 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెనను 40 రోజుల క్రితం సీఎం భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. ఈ వంతెన వరియావ్, వేద్ గ్రామాలను కలుపుతుంది. ఈ ప్రాంతంలోని ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలకు ఈ వార‌ధియే ర‌వాణా మార్గం.

నాలుగు లేన్ల‌తో 1.5 కిలోమీట‌ర్ల పొడవున ఈ వంతెన నిర్మించారు. వంతెన ప‌గుళ్ల‌కు సంబంధించిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Exit mobile version