Site icon vidhaatha

Suryapeta | ఎలుగుబంటిని బంధించిన ఫారెస్ట్ అధికారులు.. పర్యవేక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి

Suryapeta

విధాత: సూర్యాపేట జిల్లా కేంద్రంలో హల్చల్ చేసిన ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు బంధించారు. పట్టణంలోని ఓ ఇంట్లోకి చొరబడిన ఎలుగుబంటిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు
మూడూ గంటల పాటు తీవ్రంగా శ్రమించారు.

ఎలుగుబంటి బలంగా (దాదాపు110కిలోలు.. మగది) ఉండటంతో క్రమంగా మత్తు డోసు పెంచుతూ అదుపులోకి తీసుకున్నారు. దానిని వరంగల్ జూ కు తరలిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

ఎలుగుబంటి హల్చల్ విషయం తెలుసుకున్న మంత్రి జి. జగదీష్ రెడ్డి సైతం అక్కడికి చేరుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా దానిని సురక్షితంగా బంధించి తరలించే పనులు చేయాలని అటవీ, పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎట్టకేలకు ఎలుగుబంటిని బంధించడంతో పట్టణవాసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version