విధాత : వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) లో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. ఓ విద్యార్థికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నిట్ క్యాంపస్ అధికారులు అప్రమత్తమయ్యారు.
నిట్ స్టూడెంట్ ఒకరు జ్వరంతో బాధపడుతుండగా, హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు.
దీంతో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా, స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆస్పత్రి వైద్యులు.. జిల్లా మెడికల్ ఆఫీసర్‌తో పాటు నిట్ అధికారులను అప్రమత్తం చేశారు. స్వైన్ ఫ్లూ కలకలంతో నిట్ క్యాంపస్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ నిర్వహించారు.
స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయిన విద్యార్థితో సన్నిహితంగా మెలిగిన విద్యార్థులను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఎవరిలోనైనా స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న బాధిత విద్యార్థులు కనీసం వారం రోజుల పాటైనా ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.