TDP |
విధాత: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మంగళవారం ఆకస్మికంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలీలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు ఐసీయులో చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతానికి జ్ఞానేశ్వర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యుల కథనం. ఇటీవల వరకు ఆరోగ్యంగానే ఉన్న జ్ఞానేశ్వర్ తెలంగాణ పార్టీ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడం పార్టీ శ్రేణులను, ఆయన అభిమానులను, అనుచరులను కలవరపాటుకు గురి చేసింది.