Site icon vidhaatha

TDP | అభ్యర్థుల ఎంపికకు టీడీపీ కమిటీ

TDP |

విధాత: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక పక్రియను తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక పక్రియ కోసం ప్రత్యేకంగా ఏడుగురు సభ్యులతో కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియమించారు.

తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కంభంపాటి రామమోహన్ రావు, అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, పార్టీ సీనియర్ నేతలు నర్సిరెడ్డి, కాశీనాథ్ లతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన తరువాత ఈ కమిటీ జాతీయ అధ్యక్షుడికి నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, ప్రకటన జరగనుంది.

Exit mobile version