Site icon vidhaatha

Kesineni Nani | ఆయనే టికెట్ ఇచ్చేసుకున్నారు.. కేశినేని నాని స్వీయ ప్రకటన

Kesineni Nani | విధాత: ఏ పార్టీకి అయినా అధిష్టానం టికెట్లు ఇస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఎక్కడ ఎవరు పోటీ చేయాలన్నది నిర్ణయిస్తుంది. కానీ విజయవాడ వరకూ మాత్రం టీడీపీ ఎంపీ కేశినేని నాని భిన్నంగా ఉంటారు. తన టికెట్ ను తానే ప్రకటించుకుంటున్నారు. అధిష్టానంతో సంబంధం లేకుండా తానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండుసార్లు విజయవాడ ఎంపీగా గెలిచినా, అధిష్టానానికి తలనొప్పిగా మారారని, ఆయన్ను తప్పించేందుకు.. అక్కడ ఈసారి నాని తమ్ముడు చిన్నికి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజయవాడలో నాని పెద్దరికాన్ని తప్పించి చిన్నికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.

కానీ నాని మాత్రం తన పట్టును వదలడం లేదు. నిన్న అయన ఏకంగా తాను ఎంపీగా పోటీ చేస్తున్నాను అని చెబుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎంఎస్ బేగ్ అనే టీడీపీ కార్యకర్తను ఎమ్మెల్యేగా కూడా ప్రకటించేసారు. అక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉండగా, టీడీపీ నుంచి జలీల్ ఖాన్ ( బీకామ్ ఫిజిక్స్ ఫెమ్ ) కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు నాని ఏకంగా బేగ్ కు టికెట్ ప్రకటించి, అధిష్టానం నిర్ణయాలను సైతం హైజాక్ చేసేందుకు సిద్ధపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ఏమి చేస్తారు ? ఎలా ? నిర్ణయాలు తీసుకుంటారు.. నానితో గొడవ పడతారా ? నాని నిర్ణయాన్ని చంద్రబాబు కాదంటారా ? నానితో ఢీకొంటారా ? ఏమిటన్నది చర్చనీయాంశమైంది.

Exit mobile version