నల్గొండ: సీఎం కేసీఆర్ పర్యటన.. యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

విధాత: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనుల పరిశీలన కోసం సోమవారం సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేశారు. థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిన క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి […]

  • Publish Date - November 28, 2022 / 07:57 AM IST

విధాత: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనుల పరిశీలన కోసం సోమవారం సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేశారు.

థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిన క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.

ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలో గల యాదాద్రి ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ వస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు.

పవర్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని హామీలు ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. దీంతో శంకర్ నాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

అయితే సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో పవర్ ప్లాంట్‌కు చేరుకుని ఏరియల్ వ్యూ నిర్వహించారు.