Site icon vidhaatha

తెలంగాణ కేబినెట్‌.. ఆ ముగ్గురి మంత్రుల‌పై ఎలాంటి కేసుల్లేవ్..

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రేవంత్ కేబినెట్‌లో 11 మందికి చోటు ద‌క్కింది. అయితే రేవంత్ స‌హా తొమ్మిది మంది మంత్రుల‌పై క‌లిపి మొత్తం 136 క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్ల‌డించింది. ముగ్గురు మంత్రుల‌పై ఎలాంటి క్రిమిన‌ల్ కేసులు లేవ‌ని స్ప‌ష్టం చేసింది.


సీఎం రేవంత్ రెడ్డిపై అత్య‌ధికంగా 89 క్రిమిన‌ల్ కేసులు పెండింగ్‌లో ఉండ‌గా, అందులో సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు 50 దాకా ఉన్నాయి. ఇక మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుపై ఎలాంటి క్రిమిన‌ల్ కేసులు లేవ‌ని ఏడీఆర్ తెలిపింది. రేవంత్ త‌ర్వాత 11 కేసుల‌తో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉన్నారు. పొన్నం ప్ర‌భాక‌ర్‌పై 7 కేసులు, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై 6 కేసులు, సీత‌క్క‌పై 6 కేసులు, శ్రీధ‌ర్ బాబు 5 కేసులు, కొండా సురేఖ‌పై 5 కేసులు, భ‌ట్టి విక్ర‌మార్క‌పై 3 కేసులు, జూప‌ల్లి కృష్ణారావుపై 3 కేసులు న‌మోదు అయిన‌ట్లు త‌మ ఎన్నిక‌ల ఆఫిడ‌విట్ల‌లో పేర్కొన్న‌ట్లు ఏడీఆర్ తెలిపింది.

Exit mobile version