Nalgonda
- నల్లగొండ జిల్లా అయిటిపాములలో ఘటన
విధాత: గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. కొన్ని గ్రామాల్లోని వీధుల్లో కనీసం నడువలేని పరిస్థితులు దాపురించాయి. దాంతో గ్రామస్థులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. నల్లగొండ కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ రోడ్లపై కనీసం నడిచే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అయిపాముల గ్రామంలోని రెండో వార్డు, పదో వార్డులో రోడ్లు మురుగు కాల్వలను తలపిస్తున్నాయి. సీసీ రోడ్లు వేయాలని ఎన్ని చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం వార్డు మహిళలు రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం తొందరగా చేపట్టాలని పాలకవర్గాన్ని స్థానికులు డిమాండ్ చేశారు.