IND VS WI T20 | వింత కార‌ణంతో ఆల‌స్యంగా ప్రారంభ‌మైన మూడో T20.. గెలుపెవ‌రిదంటే…!

IND VS WI T20 | ప్ర‌స్తుతం వెస్టిండీస్‌-భార‌త్ మ‌ధ్య టీ20 సిరీస్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి రెండు టీ20ల‌లో గెలిచిన విండీస్ జ‌ట్టు మూడో టీ20లో సూర్య ప్ర‌తాపానికి ఓట‌మి బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. 51వ టీ20 మ్యాచ్ ఆడిన‌ సూర్యకుమార్ యాదవ్..44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి భార‌త్‌కి మంచి విజ‌యాన్ని అందించాడు. ఇక మ‌రో బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ, మూడో టీ20 మ్యాచ్‌లోనూ మంచి ఇన్నింగ్స్‌తో […]

  • Publish Date - August 9, 2023 / 02:24 AM IST

IND VS WI T20 |

ప్ర‌స్తుతం వెస్టిండీస్‌-భార‌త్ మ‌ధ్య టీ20 సిరీస్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి రెండు టీ20ల‌లో గెలిచిన విండీస్ జ‌ట్టు మూడో టీ20లో సూర్య ప్ర‌తాపానికి ఓట‌మి బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. 51వ టీ20 మ్యాచ్ ఆడిన‌ సూర్యకుమార్ యాదవ్..44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి భార‌త్‌కి మంచి విజ‌యాన్ని అందించాడు.

ఇక మ‌రో బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ, మూడో టీ20 మ్యాచ్‌లోనూ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 పరుగులు చేసిన తిలక్ వర్మ, హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో నిలిచాడు. వీరిద్ద‌రి సునామి ఇన్నింగ్స్‌కి భార‌త్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగుల స్కోరు చేసింది. బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్ కలిసి తొలి వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం అందించిన త‌ర్వాత వెంట‌వెంట‌నే వికెట్స్ ప‌డ‌డంతో స్కోర్ నెమ్మ‌దించింది.

రోవ్‌మెన్ పావెల్‌..19 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేయ‌డంతో విండీస్ జ‌ట్టు 159 ర‌న్స్ చేయ‌గ‌లిగింది. ఇక భార‌త జ‌ట్టులో శుభ‌మ‌న్ గిల్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఇక ఇషాన్ స్థానంలో వ‌చ్చిన య‌శ‌స్వి కూడా త‌క్కువ స్కోరుకే వెనుదిరిగారు.

సూర్య భాయ్ ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ తో పాటు తిలక్ వర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో మూడో టీ20లో భార‌త్ ఘన విజయం అందుకుంది భారత జట్టు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో విండీస్ ఆధిక్యాన్ని 2-1 తేడాకి తగ్గించింది.

ఇక మూడో టీ20కి ముందు ఓ ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. వింతైన కార‌ణం వ‌ల‌న మ్యాచ్ 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అందుకు కార‌ణం మ్యాచ్ ఆరంభానికి ముందు గ్రౌండ్‌లో 30 యార్డ్స్ సర్కిల్ గీయక‌పోవ‌డం. మ్యాచ్ స‌మ‌యానికి కొన్ని నిమిషాల ముందు ఇది గుర్తు రావ‌డంతో హ‌డావిడిగా ఆ ప‌ని చేశారు.

క్రికెట్‌లో ఇలాంటి విష‌యాల‌పై తన స్టైల్‌లో స్పందించే భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, దీనిపై కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. ‘యూనిక్ డిలే.. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా టూర్‌ని ముగించడం సాధ్యం కాదు. క్రికెటర్‌గా ప్రతీ చిన్న విషయానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవల్సి ఉంటుంది. ఊహించనిదేదో జరగబోతుందని అనుకోవడమే ఉత్తమం అని రవిచంద్రన్ అశ్విన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు

Latest News